‘ఇండియన్-2’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంత ఉందంటే?

by Hamsa |
‘ఇండియన్-2’ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంత ఉందంటే?
X

దిశ, సినిమా: స్టార్ హీరో కమల్ హాసన్, శంకర్ కాంబోలో రాబోతున్న మూవీ ఇండియన్-2. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ ఇండియన్ మూవీకి సిక్వెల్‌గా తెరకెక్కింది. దీనిని లైకా ప్రొడక్షన్, రెడ్ జాయింట్ మూవీస్ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిన్, సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. అయితే ఇందులో సిద్దార్థ్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, ఎస్ జె సూర్య, బాబీ, సింహ, సముద్రఖని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, గ్లింప్స్ భారీ బజ్ క్రియేట్ చేశాయి. ఈ మూవీ జూలై 12న గ్రాండ్‌గా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఇండియన్-2 సెన్సార్ పూర్తైనట్లు తెలుస్తోంది. దీనికి ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇండియన్-2 ఏకంగా 3 గంటల 10 నిమిషాల నిడివి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, జూన్ 25న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల కానున్నట్లు టాక్.Next Story

Most Viewed