నిజజీవితంలోనూ నటిస్తూ బతకలేనూ: Taapsee

by Disha Web Desk 7 |
నిజజీవితంలోనూ నటిస్తూ బతకలేనూ: Taapsee
X

దిశ, సినిమా: కొన్ని రోజులక్రితం ఫొటోగ్రాఫర్‌లపై తాప్సిపన్ను ఫైర్ అయిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. దీన్ని చూసిన ప్రతిఒక్కరూ నటికి చాలా పొగరుందని ట్రోల్ చేశారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.

'నిజ జీవితంలో నాకు కొంతమంది నటుల్లాగా నటించడం రాదు. ఎల్లప్పుడూ ఒకలాగే ఉంటా. నటన ఎక్కవ రోజులు దాగదు. సినిమా వాళ్ల నిజస్వరూపం బయటపడినప్పుడు సమాజంలో గౌరవం పోతుంది. పది నిమిషాలు కెమేరాలముందుంటే నన్ను ఇబ్బందిపెట్టారు. కారులోకి ఎక్కుతున్నపుడు డోర్ క్లోజ్ చేయకుండా పట్టుకున్నారు. మీరు మీ కారులోకి వెళ్తుంటే ఇతరులు వచ్చిన డోర్ పట్టుకుని వేలాడుతూ కెమెరాను మీ ముఖంలో పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అమ్మాయని చూడకుండా ఇలాగే చేస్తారా? అందుకే ఆ క్షణం అలా ప్రవర్తించాను' అని చెప్పుకొచ్చింది.

Next Story