ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న .. బికినీలో ఇలియానా మిర్రర్ సెల్ఫీ

by Kavitha |
ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న .. బికినీలో ఇలియానా మిర్రర్ సెల్ఫీ
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ ఇలియానా గతేడాది కొడుకు కోవాకు జన్మనిచ్చింది. ప్రస్తుతం అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది ఈ గోవా బ్యూటీ. అయితే ముందు నుంచి ఇలియానా తన భర్త విషయం సీక్రెట్ గానే ఉంచింది. బిడ్డ పుట్టిన తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా తన ప్రెగ్నెన్సీ, తన భర్త గురించి మాట్లాడింది.. ‘నేను బిడ్డ పుట్టాక చాలా డిప్రెషన్ కి గురయ్యాను. చాలా ఏడ్చాను. ఎందుకంటే నా బాబు వేరే గదిలో పడుకుంటే డాక్టర్లు బాగా చూసుకున్నారు. నేను ఇంకో గదిలో ఉండి ఏడ్చాను. ఆ సమయంలో నాకు మైఖేల్ డోలన్ (ఇలియానా భర్త) తోడుగా నిలబడ్డారు. నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పి బాబుని తనే చూసుకున్నాడు. ఇంత మంచి వాడు నాకు భర్తగా రావడం నా అదృష్టం. నేను ఏమి చెప్పకుండానే నాకు కావాల్సినవి అన్ని చేస్తాడు’ అని చెప్పుకొచ్చింది. రీసెంట్ గా తన భర్తతో లవర్స్ డే కూడా జరుపుకుంది ఈ చిన్నది. ఏదేమైనప్పటికి నటి తన మ్యారేజ్ లైఫ్ లో అందంగా గడుపుతుంది.

అయితే తాజాగా ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో బాత్రూం సెల్ఫీ పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు ఓ ప్రత్యేకత ఉందట. ఏంటి అంటే ఈ ఫోటో సరిగ్గా ఏడాది కిందట, ఆమె నాలుగు నెలల ప్రెగ్నెన్సీ లో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటో అంటా. కాగా తన ప్రెగ్నెన్సీ రోజులను బాగానే ఆస్వాదించిన ఆమె.. ఆ జ్ఞాపకాలను నెమరేసుకుంటోంది. ప్రస్తుతం ఇలియానా అమెరికాలో తన పార్ట్‌నర్ తో కలిసి ఉంటోంది.





Next Story