మంజుమ్మల్ బాయ్స్‌ మూవీ టీంకు నోటీసులు పంపిన ఇళయరాజా

by Mahesh |
మంజుమ్మల్ బాయ్స్‌ మూవీ టీంకు నోటీసులు పంపిన ఇళయరాజా
X

దిశ, వెబ్‌డెస్క్: దిశ, వెబ్ డెస్క్: మాలీవుడ్ ఫిల్మ్ 'మంజుమ్మల్ బాయ్స్' భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మలయాళంలోనే కాదు రిలీజ్ అయిన ప్రతి భాషలోనూ సూపర్ హిట్ కొట్టింది. ఫ్రెండ్ షిప్ కోసం ప్రాణాలు ఇచ్చే మిత్రుల కథ నేపథ్యంలో వచ్చిన ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీ.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రం ప్రస్తుతం చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఈ చిత్ర నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపినట్లు సమాచారం. గుణ సినిమాలోని కన్మణి అన్బోడు పాటను ఈ చిత్రంలో తన అనుమతి లేకుండా వినియోగించడం ఇందుకు కారణం. కాగా ఈ చిత్ర నిర్మాతలు ఈ పాటను ఉపయోగించడానికి తన పర్మిషన్ కోరలేదని తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాడు. తన సమ్మతి లేనప్పుడు ఎలా వాడుతారని ప్రశ్నించాడు. కాపీరైట్ చట్టం, 1957 కింద లీగల్ నోటీస్ పంపాడు. ఇళయరాజా తన సంగీతం విషయంలో పక్కాగా ఉంటున్నాడన్న విషయం తెలిసిందే. తన సాంగ్ ఉపయోగించుకున్నందుకు రజనీకాంత్ నటించిన కూలీ నిర్మాతలకు కూడా లీగల్ నోటీసులు జారీ చేశారు. అయితే మంజుమ్మల్ బాయ్స్ లో వినియోగించిన పాటకు గుణ మూవీ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇప్పటికే నిర్మాతలు అనుమతి తీసుకున్నారని సమాచారం.

Next Story