ఈ ఒక్క తప్పు చేయకుండా ఉంటే.. నాగ చైతన్య జాతకమే మారిపోయేది?

by Prasanna |
ఈ ఒక్క తప్పు చేయకుండా ఉంటే.. నాగ చైతన్య జాతకమే మారిపోయేది?
X

దిశ, వెబ్ డెస్క్: యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అక్కినేని నాగేశ్వరావు మనవడిగా నాగార్జున తనయుడిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయయ్యాడు.నాగచైతన్య సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోగా మాత్రం ఎదగలేకపోయాడు. ఇంకా టైర్ టు హీరోల లిస్టులోనే ఉన్నాడు. ఒక్క హిట్ కొడితే రెండు మూడు ఫ్లాపులు ఉండేవి. అయితే కెరియర్ ఆరంభంలోనే చేసిన ఈ ఒక్క తప్పు వల్లే నాగచైతన్య స్టార్ హీరో అవ్వలేకపోయాడు.

జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. మొదటి ప్రయత్నంలోనే ప్రేక్షకులను నిరాశపరిచాడు. ఈ సినిమా చైతూ కెరియర్ కి పెద్ద మైనస్ అనే చెప్పాలి. అయితే మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నాగచైతన్య కొత్త బంగారులోకం సినిమాతో హీరోగా అడుగు పెట్టాల్సింది. కానీ నాగచైతన్య మాత్రం నేను లవ్ స్టోరీస్ చేయను ఏదైనా మాస్ సినిమాతోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాను అని ఈ సినిమాను చేయలేను అని చెప్పేశారట. జోష్ సినిమా అట్టర్ ఫ్లాప్ కాగా కొత్త బంగారులోకం సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Read More: అల్లు అర్హ మొదటి రోజు స్కూల్ ఫొటో చూశారా.. ఎంత బాగుందో?

Next Story

Most Viewed