- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఇండియా నన్ను వెలివేస్తే హాలీవుడ్ లో సినిమా తీస్తా : సందీప్ రెడ్డి వంగా

దిశ, సినిమా: ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్ లల్లో సందీప్ రెడ్డి వంగా ఒకరు. తీసింది రెండే సినిమాలు అయినప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ‘యానిమల్’తో తన సత్తా చాటుకున్నాడు సందీప్. దీంతో అతని తదుపరి చిత్రం పై ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఉన్నారు. అయితే ఎంత ఫేమ్ సంపాదించుకున్నప్పటికి అంతకంత విమర్శలు కూడా ఎదురుకుంటున్నాడు. ఎందుకంటే సందీప్ తన సినిమాల్లో హీరోయిన్లను చూపించే విధానంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దీంతో ఈ ప్రభావం అతని తదుపరి చిత్రం పై కూడా పడుతుంది.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ ఇండియాలో నన్ను వ్యతిరేకిస్తే హాలీవుడ్లో సినిమా తీస్తానంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.. ‘ నా సినిమాలని, నన్ను ఎవరు ఆపలేరు. ఇక్కడ వ్యతిరేకిస్తే ఇతర భాషల్లో చేస్తా. మరాఠి, భోజ్‌పురి, బెంగాలీ, తమిళం, కన్నడ, మలయాళం, ఒడియా, హిందీలో కూడా సినిమాలు చేస్తాను. నాకు లాంగ్వేజ్ బారియర్స్ లేవు. ఇండియాలో అడ్డుకుంటే హాలీవుడ్‌లో అయిన సినిమా చేస్తా’ అంటూ డేర్‌గా తెలిపాడు సందీప్. ప్రజంట్ ఈ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.