సినిమా నచ్చకుంటే డబ్బు వాపస్ చేస్తాను.. యంగ్ హీరో కామెంట్స్ వైరల్

by sudharani |
సినిమా నచ్చకుంటే డబ్బు వాపస్ చేస్తాను.. యంగ్ హీరో కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘రామ్ నగర్ బన్నీ’. శ్రీనివాస్ మహత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విస్మయ శ్రీ , రిచా జోషి, అంబికా వాణి, రితూ మంత్ర హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దివిజ ప్రభాకర్ సమర్పణలో మలయజ ప్రభాకర్, ప్రభాకర్ పొడకండ నిర్మిస్తున్నారు. ఇక అక్టోబర్ 4న "రామ్ నగర్ బన్నీ" ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా RGV మాట్లాడుతూ.. ‘‘రామ్ నగర్ బన్నీ’ సినిమా మంచి కంటెంట్‌తో వస్తున్నట్లు టీజర్, ట్రైలర్‌తో తెలుస్తోంది. చంద్రహాస్ ప్రామిసింగ్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడు. బాగా పర్‌ఫార్మ్ చేస్తున్నాడు. ఈ సినిమా చంద్రహాస్‌తో పాటు ప్రభాకర్‌కు పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని తెలిపారు.

హీరో చంద్రహాస్ మాట్లాడుతూ.. ‘మా "రామ్ నగర్ బన్నీ" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్ట్‌గా వచ్చిన రామ్ గోపాల్ వర్మ గారికి థాంక్యూ. నాకు హీరోకు ఉండాల్సిన క్వాలిటీస్ ఉన్నాయని ఆయన చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నాన్న ప్రభాకర్ ఇందాక చెప్పినట్లు ఆయనకు ఎంతమంది సపోర్ట్ చేశారో, అవసరం పడితే నేనూ వాళ్లందరి కోసం పరుగులు పెడుతూ వెళ్తాను. ఈ సందర్భంగా మూడు ప్రామిస్‌లు చేస్తున్నా. నేను మాట ఇస్తే తప్పను. నా "రామ్ నగర్ బన్నీ" సినిమా లాభాల్లో 10 శాతం ప్రజలకు ఛారిటీ కోసం ఇచ్చేస్తా. సినిమా చూసి ఆటిట్యూట్ స్టార్ అనే ట్యాగ్‌కు నేను అర్హుడిని కాదంటే నా నెక్ట్ రెండు సినిమాలకు ఆ పేరు పెట్టుకోను. అలాగే మీరు మా "రామ్ నగర్ బన్నీ" సినిమా చూసి మీకు నచ్చకుంటే నాకు మీ టికెట్ ఫొటోతో ఇన్‌స్టా ద్వారా చెప్పండి మీ డబ్బులు కంపల్సరీ గూగుల్ పే చేస్తా. ఎంతమంది పంపింతే అంతమందికి డబ్బులు రిటర్న్ ఇస్తా’ అని చెప్పుకొస్తూ.. అక్టోబర్ 4న థియేటర్స్‌కు వెళ్లి మా మూవీ చూసి మీ ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా అని తెలిపాడు చంద్రహాస్.

Advertisement

Next Story

Most Viewed