- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వారి కారణంగా మూడు సార్లు చావుబతుకుల నుండి బయటపడ్డా : ప్రియాంక సింగ్

దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రియాంక ఒకరు. అలా బిగ్ బాస్ దాకా వెళ్ళిన ఈ అమ్మడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. ప్రజంట్ పలు టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్న ప్రియాంక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ, తనకు సంబంధించిన చాలా విషయాలు పంచుకుంటూ ఉంటుంది.
ఇందులో భాగంగా తాజాగా ఓ య్యూటుబ్ ఛానల్ కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తను ఎదుర్కొన్న కష్టాలు చెప్పుకొచ్చింది.. ప్రియాంక మాట్లాడుతూ ‘ నేను అమ్మాయిగా మారకముందు నా అసలు పేరు తేజ్ బహదూర్ సింగ్ . నాలో అమ్మాయి లక్షణాలు ఉండటంతో అమ్మాయిగానే మారాలనుకున్నాను. దానికోసం హార్మోన్ థెరపీ చేయించుకున్న. కానీ ఇండస్ట్రీలోకి వచ్చాక అవకాశాల కోసం ఇలా మారిపోయావా అని చాలామంది అన్నారు. ఇంకొంత నీతో ఉండాలని ఉంది, నైట్ కి ఎంత ఛార్జ్ చేస్తావు అని అడిగేవారు. అలా ఇండస్ట్రీలో ఎంతో మంది చిన్నచూపు చూశారు.
ఈ మధ్య సోషల్ మీడియాలో బూతు ఎక్కువైపోయింది. చండాలంగా కామెంట్స్ చేస్తున్నారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. అది దాటితే ఓపిక చచ్చిపోతుంది. అందుకే అప్పుడప్పుడు సీరియస్ అవుతూ ఉంటాను. అంతెందుకు మొదట్లో మా ఊళ్ళో వాళ్ళు చాలా మాటలు అనేవారు, వారితో పాటుగా మా ఇంట్లో వాళ్ళు కూడా నన్ను అలాగే చూసేవారు. తట్టుకోలేక పోయాను. ఒకసారి ఒంటి మీద కిరోసిన్ పోసుకొని కాల్చుకున్నాను. అలా మూడు సార్లు చావాలనుకుని.. బతికి బయటపడ్డాను. అప్పుడే డిసైడ్ అయ్యాను నేను ఏదో సాధించాలి అని. అందుకే కెరీర్ కోసం కష్ట పడుతున్నా. ఎవ్వరి కోసం కాదు. నా కోసం నేను కష్టపడుతున్నా’ అంటూ చెప్పుకొచ్చింది ప్రియాంక. ప్రజంట్ ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.