- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ విషయంలో నేను మారను అలాంటివి చేయడానికి ఎప్పుడూ రెడీ: అనసూయ

దిశ, సినిమా: జబర్దస్త్ యాంకర్ అనసూయ గత కొద్ది కాలంగా బుల్లితెరకు దూరమై బిగ్ స్క్రీన్‌పై కనిపిస్తున్న విషయం తెలిసిందే. మొదట రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో నటించిన అనసూయకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఆమె చావు కబురు చల్లగా చిత్రంలో ఐటెం సాంగ్ కూడా చేసింది. అంతేకాకుండా పాత్రు ఎంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ బిగ్ స్క్రీన్ పై దూసుకెళ్తుంది.
ప్రస్తుతం అనసూయ రజాకార్ చిత్రంలో సీరియస్ రోల్‌లో కనిపించనుంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇకపై గ్లామర్ రోల్స్ చేయరా అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి అనసూయ స్పందిస్తూ.. ‘‘ నేను మారలేదు. అయితే ఈ చిత్రం ద్వారా ఎంర్టైరన్‌ని అయ్యాను. నేను మారను స్పెషల్ సాంగ్స్ ఇప్పుడు కూడా చేస్తాను. రజాకార్ మూవీలో పాత్రకు నేను కనెక్ట్ అయి చేశాను.
ఇది నిజంగా జరిగిన కథ కావడంతో ఆసక్తి పెరిగింది. నా కోసం ఎలాంటి పాత్ర రాసినా చేస్తాను. కాబట్టి నేను అన్ని రకాల పాత్రలు, గ్లామరస్ రోల్స్ చేయడానికి సిద్ధం’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా అనసూయ సినిమాల్లో కీలక పాత్రలు చేస్తూనే పలు షాపింగ్ మాల్స్ ఒపెనింగ్స్‌కు వెళ్తూ చేతినిండా డబ్బు సంపాదిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరవుతుంది. అలాగే కొన్నిసార్లు తన హాట్ ఫొటోలను షేర్ చేసి ట్రోల్స్‌ను సైతం ఎదుర్కోంటుంది. అయినప్పటికీ తనదైన స్టైల్లో స్పందిస్తూ తనను ట్రోల్ చేసేవారికి గట్టిగా సమాధామిస్తుంది. అనసూయ ఏ పోస్ట్ పెట్టినా నిమిషాల్లో వైరల్ అవుతోంది.