పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశా.. నటి రేవతి షాకింగ్ కామెంట్స్!

by Kavitha |
పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశా.. నటి రేవతి షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: అలనాటి హీరోయిన్ రేవతి అందరికీ సుపరిచితమే. ఈమె అసలు పేరు ఆశా కేలున్ని. భారతీరాజా దర్శకత్వంలో రూపొందిన ‘మణ్ వాసనై’ అనే తమిళ చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అదేవిధంగా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో వచ్చిన ‘మానస వీణ’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. ఇక తన అందం, అభినయంతో నటించి మెప్పించింది. అనుక్షణం, లోఫర్, బ్రహ్మోత్సవం, యుద్ధం శరణం వంటి సినిమాల్లో నటించింది. ఈమె మలయాళంతో పాటు, తెలుగు, కన్నడ, హిందీ వంటి భాషా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈమె కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా తనదైన బాణీ పలికించింది.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సినీ ప్రయాణం, పెళ్లి ప్రయాణం గురించి ఓపెన్‌గా చెప్పేసింది. ఆమె మాట్లాడుతూ.. 17 ఏళ్ల ఏజ్‌లో నటించడం స్టార్ట్ చేశా తర్వాత కంటీన్యూగా మూడు సంవత్సరాలు నటించిన నేను 20 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాను. పెళ్లయ్యాక వన్ ఇయర్ వరకు నటించలేదు. తర్వాత మళ్లీ ఇష్కీ వాసల్, దేవర మగన్ వంటి మంచి సినిమాల్లో నటించాను. కానీ పెళ్లి తర్వాత చాలా సినిమాలు చేయలేక పోయా.. అప్పుడే పెళ్లి చేసుకుని తప్పు చేశానని అనిపించింది. కెరీర్ కాస్త చూసుకుని ఆ తర్వాత చేసుకుంటే బాగుండేది అంటూ చెప్పుకొచ్చారు రేవతి.Next Story

Most Viewed