‘యానిమల్’లో సీన్స్ చాలా నచ్చాయి.. నేను అలా చేస్తా స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Disha Web Desk 6 |
‘యానిమల్’లో సీన్స్ చాలా నచ్చాయి.. నేను అలా చేస్తా స్టార్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో ఇటీవల తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్‌గా నటించింది. అయితే యానిమల్ థియేటర్స్‌లో డిసెంబర్ 1న విడుదలై బాక్సీఫీసును షేక్ చేసింది. అలాగే భారీ కలెక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా ఇందులో బోల్డ్ సీన్స్ చూసిన వారంతా షాక్ అయ్యారు. అయితే యానిమల్ ఇటీవల ఓటీటీలో విడుదలై విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఇందులోని సీన్స్ మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ వెంటనే తొలగించాలని పెద్ద ఎత్తున పోస్టులు కూడా పెట్టారు. అయినప్పటికీ యానిమల్ ఎక్కువ వీక్షకులు చూస్తున్న సినిమాగా రికార్డ్ సృష్టిస్తూ దూసుకెళ్తుంది. అయితే దీనిపై ఎంతో మంది సినీ సెలబ్రిటీలు సైతం విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ హుమా ఖురేషి యానిమల్ సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ‘‘నాకు సినిమా పిచ్చిగా నచ్చింది. యానిమల్ చూశాక నిజంగా ఆనందించాను. నాకు అందులోని ప్రతి యాక్టర్ యాక్షన్, సీన్స్ మ్యూజిక్ బాగా నచ్చాయి. ఇది చాలా జిత్తులమారి సినిమా.

నేను కూడా అన్ని రకాల కథలు తీయాలని నేను భావిస్తున్నాను. ఒక ప్రేక్షకుడిగా మీరు అలాంటి చిత్రాన్ని చూడాలా వద్దా అనేది మీ ఇష్టం. నేను మెషిన్ గన్ పట్టుకొని వేల మందిని చంపే సినిమా చేయాలనుకుంటున్నాను. ఒక నటిగా, చాలా విధ్వంసకర మార్గంలో భాగం కావడం చాలా ఉత్తేజకరమైనదని నేను భావిస్తున్నాను. ఆ విధంగా నేను ఉంచుతాను. నేను వోల్ఫ్ ఆఫ్ వాల్ స్ట్రీట్ లేదా ఎడ్జీ ఫిల్మ్‌లను చూసినప్పుడు ఒక జంతువును చూసినప్పుడు, చాలా ఉత్సాహంగా ఉంటుంది. దాని గురించి ఏదో ఉంది. అది ఏమిటో నాకు తెలియదు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హుమా కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండటంతో నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు.

Read Disha E-paper

Next Story

Most Viewed