హీరోయిన్ పూర్ణతో లవ్ ఎఫైర్ : క్లారిటీ ఇచ్చిన రవిబాబు

by Anjali |
హీరోయిన్ పూర్ణతో లవ్ ఎఫైర్ : క్లారిటీ ఇచ్చిన రవిబాబు
X

దిశ, సినిమా: ప్రముఖ హీరోయిన్ పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అవును, అవును 2 చిత్రాల ద్వారా భారీ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ అదృష్టం కలిసి రాక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మిగిలిపోయింది. ఇక పోతే.. దర్శకుడు రవిబాబు నిర్మాతగా “అసలు” అనే సినిమాతో వస్తున్నాడు. ఇందులో అతనితో పాటు పూర్ణ కూడా నటిస్తోంది. అయితే రవిబాబు సినిమాలో ఎందుకు ఎక్కువగా పూర్ణ కనబడుతోంది అంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.

అయితే తాజాగా ఈ విషయం గురించి రవిబాబు క్లారిటీ ఇచ్చారు. ‘పూర్ణతో తరచు సినిమాలు తీస్తుంటే.. నాకు, తనకు మధ్య ప్రేమ వ్యవహారం ఉందని ప్రజలు అనుకునేవారు. కానీ వాస్తవంగా చూసుకుంటే 200% మెరుగైన అవుట్‌పుట్‌ను అందించే, ప్రత్యేక నటులను ఇష్టపడే దర్శకులకు ఇది సాధారణం. పూర్ణ అటువంటి రత్నం’ అంటూ ఒక్క మాటతో ఈ రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాడు రవిబాబు. ఇక ఇటీవల పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన పూర్ణ మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి: మహిళల డ్రెసింగ్‌పై సల్మాన్ ఆంక్షలు.. యంగ్ బ్యూటీ కామెంట్స్ వైరల్

Next Story