‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమా నేనే చెయ్యాల్సింది.. ఆ కారణంగా రవితేజకు వెళ్లింది: హీరో శ్రీరామ్

by Disha Web Desk 7 |
‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమా నేనే చెయ్యాల్సింది.. ఆ కారణంగా రవితేజకు వెళ్లింది: హీరో శ్రీరామ్
X

దిశ, వెబ్‌డెస్క్: ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ.. రవితేజ మార్కెట్‌ను అమాంతం పెంచేసింది. అయితే.. నిజానికి ఈ మూవీ హీరో శ్రీరామ్ చెయ్యాల్సి ఉందట. కానీ, అతన్ని దాటి మాస్ మహారాజ రవితేజ చేతిలోకి ఈ సినిమా ఎలా వెళ్లిందనేది తాజాగా ఓ ఇంటర్వ్వూలో ఓపెన్ అయ్యారు శ్రీరామ్.

‘నా కోసం కోన వెంకట్ రెండు కథలు రాశారు. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, ‘ఒకరికి ఒకరు’. నేను మొదట సైన్ చేసింది ఒకరికి ఒకరు. అదే సమయంలో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి కూడా సైన్ చేశాను. రెండు సినిమాలు ప్రకటించేశారు. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలో ఎక్కువ ఫైట్ సీన్స్ ఉంటాయి. నేను ఫైట్స్ చేసే స్థితిలో లేను. కానీ, ఆ సినిమాలో ఫైట్సే హైలెట్స్. నాకోం ఫైటింగ్ సీన్స్ తగ్గించడం కరెక్ట్ కాదు. నేను ఆ సినిమాలో నటించడం వల్ల న్యాయం చేయలేను అనే ఆలోచనతోనే నేను దాని నుంచి బయటికి రావాల్సి వచ్చింది. ఈ కారణంగా ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ సినిమా వదులుకోవాల్సి వచ్చింది. అయితే.. ఈ ఒక్క సినిమానే కాదు.. మణిరత్నం సినిమాతో పాటు చాలా ప్రాజెక్టులే చేజార్చుకున్నాను’ అంటూ శ్రీరామ్ చెప్పుకొచ్చారు. అయితే.. నాకు గాయాలు అయిన కారణంగా నేను ఇక సినిమాలు చేయలేమోనని అందరూ భావించారు. కానీ దేవుడు దయవల్ల మళ్లీ నేను సినిమాల్లో రాణిస్తున్నాను అని తెలిపారు శ్రీరామ్.

Next Story

Most Viewed