ఆ యాంకర్‌పై అసూయ, ఈర్ష్య కలిగింది.. సుమ కనకాల కామెంట్స్ వైరల్!

by Hamsa |
ఆ యాంకర్‌పై అసూయ, ఈర్ష్య కలిగింది.. సుమ కనకాల కామెంట్స్ వైరల్!
X

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ సుమ కనకాల ఎన్నో షోస్, ఈవెంట్స్, ప్రీరిలీజ్ ఈవెంట్స్ చేసి స్టార్ యాంకర్‌గా రాణిస్తోంది. ఇప్పటికీ వరుస షోస్, ఈవెంట్స్ అంటూ ఫుల్ బిజీ అయిపోయింది. యాంకరింగ్‌లో తనదైనశైలితో అందరి హృదయాలను కొల్లగొడుతుంది. అలాగే యాంకరింగ్‌గానే కాకుండా సుమ పలు చిత్రాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించింది. ప్రస్తుతం బుల్లితెరపై స్పెషల్ షోలు చేస్తూ సందడి చేస్తుంది. అంతేకాకుండా ఇటీవల తన కొడుకును హీరోగా పరిచయం చేసింది.

అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ పలు ఫొటోలతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సుమ ఓ ఇంటర్వ్యూలో భాగంగా తనకు ఓ యాంకర్ అంటే అసూయ కుల్లు కలిగిందని చెప్పుకొచ్చింది. ‘‘ఈర్ష్య లేని మనిషి ఉంటే అది వేరే స్థాయిలో ఉండాలి. కానీ అలా ఉండటం చాలా కష్టం. ప్రతి మనిషిలోనూ ఈర్శ కలుగుతుంది. నాకు యాంకర్ అనసూయను చూసినప్పుడు ఈర్ష్య కలిగింది. అలా అని దాన్ని ఈర్ష్య అనను కానీ తనంత ఎత్తులేనని అనిపించింది. అంతేకాకుండా స్వతహాగా వచ్చే చిన్నపాటి కుల్లు అన్నమాట’’ అంటూ చెప్పుకొచ్చింది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read More..

నా భర్త అర్థరాత్రి నిద్రలేపి దాని రుచి చూపించాడు.. స్టార్ నటి సంచలన కామెంట్స్Next Story

Most Viewed