'గాంధీ గొప్పవాడని నేను అనుకోను'.. ప్రముఖ నటుడి ట్వీట్ వైరల్

by Disha Web Desk 7 |
గాంధీ గొప్పవాడని నేను అనుకోను.. ప్రముఖ నటుడి ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: 'జయమ్ము నిశ్చయమ్మురా' అనే సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం టాప్ కమెడియన్‌గా దూసుకుపోతున్న రాహుల్ రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అర్జున్ రెడ్డి, జాతి రత్నాలు వంటి సినిమాల్లో ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీతో అభిమానుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అటూ సినిమాలు చేస్తూనే నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉండే రాహుల్.. ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటాడు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ కాగా.. విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

అక్టోబర్ 2 మహాత్మ గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరు ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తుండగా రాహుల్ మాత్రం గాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. తన ట్విట్టర్ ఖాతాలో ''గాంధీ గొప్పవాడని నేను అనుకోను'' అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ చూసిన నెటిజన్స్ ''ఆయన గ్రేట్ కాదు.. నువ్వే గ్రేట్ అన్నా'', ''గాంధీ జయంతి సందర్భంగా మందు దొరకదు కదా.. అందుకే పిచ్చిలేచి అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు'' అంటూ రకరకలుగా విమర్శలు చేస్తున్నారు.




Next Story

Most Viewed