నా వయసు 49.. కానీ అంటీ పాత్రలు చెయ్యను.. డైరెక్ట్‌గా చెప్పేసిన పవన్ హీరోయిన్

by sudharani |
నా వయసు 49.. కానీ అంటీ పాత్రలు చెయ్యను.. డైరెక్ట్‌గా చెప్పేసిన పవన్ హీరోయిన్
X

దిశ, సినిమా: సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కల్యాణ్ ‘బద్రి’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఈమె.. కుర్రాళ్ల హృదయాలను గెలుచుకుంది. తర్వాత మహేష్ బాబు ‘నాని’ అలాగే ‘నరసింహుడు’ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. అనంతరం వెండితెరపై కనుమరుగైపోయిన ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ.. 49 ఏళ్ల వయసులో కూడా కుర్రహీరోయిన్లకు పోటీగా గ్లామర్ షోస్ చేస్తూ అలరిస్తుంది. ఇక గతేడాది ‘గదర్ 2’తో సెకండ్స్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన అమీషా.. ఆ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దీంతో సక్సెస్ ఇచ్చిన ధీమాతో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అంటీ పాత్రలు చెయ్యనంటూ డైరెక్ట్‌గా చెప్పేసింది.

ఆమె మాట్లాడుతూ.. ‘నేను ఎప్పటికీ ఆంటీ పాత్రల్లో, తల్లి పాత్రల్లో నటించను. నాకు అవకాశాలు వచ్చినంత కాలం హీరోయిన్ గానే నటిస్తాను. నా వయసున్న నటీమణులు చాలా మంది ఆంటీలుగా నటిస్తున్న సంగతి నాకు తెలుసు. కాకపోతే అలాంటి పాత్రల్లో నటించడం నాకు మాత్రం ఇష్టం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.Next Story

Most Viewed