అతడి లెవెల్ సాధించలేదు.. విక్రమ్ వేద సినిమాపై హృతిక్ హాట్ కామెంట్స్..

by Dishafeatures2 |
అతడి లెవెల్ సాధించలేదు.. విక్రమ్ వేద సినిమాపై హృతిక్ హాట్ కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా విక్రమ్ వేద. ఈ సినిమాలో హృతిక్ నెగిటివ్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌లో హృతిక్ తనదైన నటనతో అద్దరగొట్టేశాడు. తాజాగా హృతిక్ ఈ సినిమాలో తన రోల్‌పై మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో తాను నెగిటివ్ రోల్ చేయడం కొత్త అనుభూతినిస్తుందని అన్నాడు. అయితే ఈ సినిమా ఒరిజినల్ వెర్సన్‌లో నెగిటివ్ రోల్‌లో విజయ్ సేతుపతి నటించాడు.

దీనిని ప్రస్తావించిన హృతిక్.. తాను విజయ్ లెవెల్‌ను సాధించలేనని అన్నాడు. తాను విజయ్ సేతుపతి లెవెల్‌ను సాధించగలనని కలలో కూడా ఊహించలేనని హృతిక్ అన్నాడు. విక్రమ్ వేధ ఒరిజినల్ వెర్షన్‌లో విజయ్ సేతుపతి చేసిన యాక్టింగ్‌కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందేనని, అతడి లెవెల్‌ను నేను రీచ్ కాలేనని, విజయ్ తరహాలో తాను కలలో కూడా నటించడం కుదరదని హృతిక్ చెప్పుకొచ్చాడు.

'ఒరిజినల్ వెర్షన్‌లో విజయ్ సేతుపతి ఎంతటి అద్భుత నటన కనబరిచాడో నాకు బాగా తెలుసు. నేను చేసిన నటనతో నేను సంతృప్తిగా ఉన్నాను' అని హృతిక్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే సైఫ్ అలీఖాన్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న థియేటర్లలో విడుదల కానుంది.

Also Read: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట తీవ్ర విషాదం

Next Story

Most Viewed