- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
SP బాలసుబ్రహ్మణ్యం చనిపోవడానికి నేను కారణం అంటూ.. నటుడు సంచలన వ్యాఖ్యలు!

దిశ, సినిమా: స్టార్ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 2020 సెప్టెంబర్ 25న కరోనా వచ్చి మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు. ఆయన ఎన్నో పాటలు పాడి అందరి మనసులు గెలుచుకున్నారు. ఇప్పటికీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలు విని ఎంతో మంది ఆయనను గుర్తు తెచ్చుకుని ఎమోషనల్ అవుతారు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఇదిలా ఉంటే.. ఆయన మరణానికి కారణం నేనే అంటూ టాలీవుడ్ నటుడు సంచలన నిజాలను బయటపెట్టాడు.
ఎస్పీబి చెల్లెలు శైలజను పెళ్లి చేసుకున్న శుభలేఖ సుధాకర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన వల్లే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయారని ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ కరోనా సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సినిమా షూటింగ్‌కు వెళ్లాను. అయితే అప్పుడే ఎస్పీబి ఫోన్ చేసి నాతో మాట్లాడారు. అవసరమా ఈ టైమ్‌లో షూటింగ్ ఇంట్లో ఉండక అని అన్నారు. దీంతో నేను ఎలాంటి భయం లేదు. అన్ని జాగ్రత్తలు పాటించే షూటింగ్ చేస్తున్నాము మీరు కూడా ఒకసారి రండి అని చెప్పాను. దాంతో ఆయన ఒకరోజు షూటింగ్ స్పాట్‌కు వచ్చారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంను చూడటంతో కొందరు ఫొటోలు తీసుకున్నారు.
దూరంగానే ఉండి దిగారు. కానీ ఒక్క ఫొటో అని చెప్పి చాలా పిక్స్ దిగేవరకు అంత మందిలో ఉండటం వల్ల మూడు రోజులకే కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రిలో చూపించినప్పటికీ పరిస్థితి చేజారి పోవడంతో ఆయన చనిపోయారు. దీనంతటికి కారణం నేనే అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన అక్కడికి రాకుంటే కరోనా రాకపోయేదేమో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా కొంత కాలం బతికేవారు కావొచ్చు అనే భావన కలుగుతుంది’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సుధాకర్ కామెంట్స్ వైరల్ అవుతుండటంతో అలా మీరు అనుకోకండి అంటూ ఎస్పీబి ఫ్యాన్స్ ఆయనకు ధైర్యం చెబుతున్నారు.