సినిమా థియేటర్‌లో భార్యకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భర్త.. మధ్యలోనే సైలెంట్‌గా..

by Disha Web |
సినిమా థియేటర్‌లో భార్యకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన భర్త.. మధ్యలోనే సైలెంట్‌గా..
X

దిశ, వెబ్ డెస్క్: సరదాగా ఫ్యామిలీతో కలిసి సినిమాకు వెళ్లాడు. సినిమా చూస్తూ ఎంజాయి చేయాల్సిన భర్త.. భార్యకు ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. మూవీ చూస్తూనే బయటకు వెళ్లి మళ్లీ కనిపించలేదు. బయటకు వెళ్లి వ్యక్తి ఇంక రాలేదని భార్య, పిల్లలు ఎంత వెతికినా ఆచూకీ లేకపోవడంతో భర్త అదృశ్యం అయ్యాడంటూ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భార్గవపేటకు చెందిన పడవల బాలసుబ్రహ్మణ్యం, బేబి దంపతులు. వీరికి ఓ కూతురు ఉంది. అయితే శనివారం భార్య, కూతురితో కలిసి బాలసుబ్రహ్మణ్యం సరదాగా సినిమాకు తీసుకెళ్లాడు. సినిమా చూస్తుండగానే మధ్యలోనే సుబ్రహ్మణ్యం బయటికి వెళ్లాడు.

వాష్‌రూంకు వెళ్లాడనుకున్న భార్య.. అతడి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అయినా ఎంత సమయం గడిచినా భర్త థియేటర్‌లోకి రాకపోవడంతో చుట్టు పక్కల వెతికింది. ఎక్కడా కనిపించకపోవడంతో ఇంటికి వెళ్లింది. అయితే ఇంట్లోనూ కనిపించని బాలసుబ్రహ్మణ్యం.. తన బట్టలను బ్యాగులో సర్దుకోని వెళ్లిపోయాడు. దీంతో షాక్ తిన్న భార్య భర్త అదృశ్యం అయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయా.. లేక అతడికి మరొకరి సంబంధం ఉన్నదా అన్న కోణంలో విచారణ సాగిస్తున్నారు.

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed