Mokshagna :మొదటి సినిమాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్ తీసుకోబోతున్న మోక్షజ్ఞ

by Anjali |   ( Updated:2024-09-09 14:52:33.0  )
Mokshagna :మొదటి సినిమాకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్ తీసుకోబోతున్న మోక్షజ్ఞ
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ అగ్ర హీరో బాలయ్య తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం కోట్లాది మంది జనాలు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రతీసారి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమనడం.. కానీ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులకు నిరాశే మిగిలేది. మొత్తానికి ఈయన ఫస్ట్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానే వచ్చేసింది.

బ్లాక్ బస్టర్ చిత్రం హనుమాన్‌కు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ మొదటి సినిమాను రూపొందించనున్నారు. సుధాకర్ చెరుకూర తన ఎస్వీఎల్ మూవీపై లెజెండ్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సమర్పకురాలుగా వ్యవహరించబోతున్నారు.

అయితే నిన్న (సెప్టెంబరు 6)మోక్షజ్ఞ బర్త్ డే సందర్భంగా ఓ అదిరిపోయే లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో నట సింహాం సూపర్ లుక్ తో ఆకట్టుకునే చిరునవ్వుతో.. మెస్మరైజింగ్ ప్రజెన్స్‌తో పోస్టర్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇందులో మోక్షజ్ఞ చాలా స్మార్ట్‌గా ఉన్నాడు. అప్పట్లో కాస్త బొద్దుగా ఉన్న మోక్షజ్ఞ ఇప్పుడు ఈ హ్యాండ్సమ్ లుక్‌లో కనిపించడంతో నందమూరి ఫ్యాన్స్ చిన్న బాలయ్య మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే మోక్షజ్ఞ మొదటి సినిమా కోసం ఎంత పారితోషికం తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం నందమూరి హీరో ఏకంగా 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట. ఈ వార్త విన్న నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Next Story