52 గంటల కన్నప్ప సినిమాను ఎన్ని గంటలు ట్రిమ్ చేసారంటే..?

by Prasanna |
52 గంటల కన్నప్ప సినిమాను ఎన్ని గంటలు ట్రిమ్ చేసారంటే..?
X

దిశ, సినిమా: గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న మంచు విష్ణు మరోసారి కన్నప్ప సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఫాంటసీ చిత్రంగా ఆడియెన్స్ ముందుకు రానుంది. ఈ మూవీలో ప్రీతి ముకుందన్, మోహన్ బాబు, శరత్ కుమార్, బ్రహ్మానందం, శివ రాజ్ శేఖర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ కూడా అతిధి పాత్రలో కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా, ఈ మూవీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మూవీ షూటింగ్ అంతా పూర్తయిన తర్వాత.. సినిమా ఫుటేజీని చూస్తే 52 గంటలు వచ్చింది. మేకర్స్ చాలా కష్ట పడి మూడు గంటలకు తగ్గించారు.

ఐదు, పది నిమిషాలు కట్ చేస్తే సినిమా కథ పోతుందని నమ్మే దర్శకులున్నారు. అన్నీ తీసేస్తే సినిమా దేనికోసం చూడాలని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దాదాపు 49 గంటల మూవీ వృథా అయింది. దీని కోసం నిర్మాతలు కూడా చాలా ఖర్చు పెట్టారు. మరి అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే కదా అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. ఎంత సొంత ప్రాజెక్ట్ అయినా ఇంత బడ్జెట్‌ను వేస్ట్ చేయడం దారుణం అంటూ అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.Next Story

Most Viewed