‘కల్కి 2898 AD’ ఎన్ని రోజులకి బ్రేక్ ఈవెన్ సాధించిందంటే..?

by Prasanna |
‘కల్కి 2898 AD’ ఎన్ని రోజులకి బ్రేక్ ఈవెన్ సాధించిందంటే..?
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మూవీ 'కల్కి 2898 AD'. ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. అతి భారీ బడ్జెట్ తో ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ నిర్మించారు. మూవీ టీజర్ దగ్గర నుంచి రిలీజ్ ట్రైలర్ వరకు ప్రతి ఒక్కటి భారీ హైప్ ని క్రియోట్ చేసాయి. విజువల్స్ హాలీవుడ్ మూవీస్ ని తలదన్నేలా ఉండటంతో.. సినిమాకి ప్లస్ అయింది.

మొదటి రోజు నుంచి సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. వీక్ డేస్ లో కూడా అంతే జోరుగా కలెక్ట్ చేసాయి. రెండో వారం అయితే కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ రోజుకి సినిమా రిలీజ్ అయి 12 రోజులు అయినా కూడా అదే జోష్ లో ఉంది.

'కల్కి 2898 AD' మూవీకి రూ.381 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మొత్తం మీద రూ.385 కోట్ల షేర్ ను వసూలు చేయాల్సి ఉంది. 12 రోజుల్లో ఈ మూవీ రూ.438.96 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే 11 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.53.96 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి హిట్ గా నిలిచింది.

Next Story