ఎవరైనా అలా ఎలా చేయగలరు చేతులు వణకవా.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్

by Hamsa |
ఎవరైనా అలా ఎలా చేయగలరు చేతులు వణకవా.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల నటించిన చిత్రం ‘గుంటూరు కారం’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి డైరెక్షన్‌లో SSMB29 పేరుతో రాబోతున్న సినిమా షూటింగ్‌లో ఫుల్ బిజీ అయిపోయారు. ఇటీవల కాస్త సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు.

తాజాగా, సూపర్ స్టార్ ఓ వెబ్ సిరీస్‌కు రివ్యూ ఇస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘ఎవరైనా ఇలా ఎలా చేయగలరు... చేతులు వణకవా? పోచర్ సిరీస్ చూసిన తర్వాత ఇలాంటి ప్రశ్నలు నా మదిలో మెదులుతూనే ఉన్నాయి.. ఈ సున్నితమైన దిగ్గజాలను రక్షించమని మమ్మల్ని కోరుతూ ఒక పదునైన కాల్-టు-యాక్షన్’’ అంటూ రాసుకొచ్చాడు.

కాగా, ఈ సిరిస్‌కు బాలీవుడ్ బ్యేటీ ఆలియా భయ్ నిర్మాతగా వ్యవహరించగా.. డైరెక్టర్ రిచీ మెహతా తెరకెక్కించారు. పోచర్ కేరళ అడవుల్లో జరిగిన ఒక రియల్ స్టోరీ ఆధారంగా తీసినట్లు సమాచారం. ప్రస్తుతం పోచర్‌పై మహేష్ బాబు రివ్యూ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక అది చూసిన ఫ్యాన్స్ SSMB 29 అప్డేట్ అనుకున్నాము అంటూ కామెంట్స్ పెడుతుండగా.. మరికొందరు బాబు రివ్యూ ఇచ్చాడంటే సిరీస్ ఖచ్చింతగా చూడాలని అంటున్నారు.

Next Story

Most Viewed