ప్రభాస్, అనుష్క పెళ్లికి అడ్డొచ్చిన జాతకాలు.. ఇన్నాళ్లకు బయటపడిన బిగ్ సీక్రెట్

by Prasanna |
ప్రభాస్, అనుష్క పెళ్లికి అడ్డొచ్చిన జాతకాలు.. ఇన్నాళ్లకు బయటపడిన బిగ్ సీక్రెట్
X

దిశ,వెబ్ డెస్క్: అనుష్క, ప్రభాస్ జంట అందరికి ఫెవరేట్. వీరిద్దరూ ఒకరినొకరు పెళ్లిచేసుకోవాలని మాటిచ్చుకున్నారట. ఒకవేళ అలా జరగని పక్షంలో సింగిల్‌గా ఉండిపోవాలని నిర్ణయించుకున్నారట. మరి వీళ్లిద్దరూ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం ఏంటో చాలా రోజులకి బయటకు వచ్చింది. అదేంటో ఇక్కడ తెలుసుకుందాం.

వీరిద్దరికీ పెళ్లి జరగకపోవడానికి వాళ్ల కుటుంబ సభ్యుల నిర్ణయమే కారణమట. వారిద్దరి జాతకాలు కలవకపోవడంతో ప్రభాస్ తల్లి ఈ పెళ్లికి అంగీకరించలేదట. ప్రభాస్ తల్లి దేవుడిని, జాతకాలను బాగా నమ్ముతారట. తల్లి మాటను జవదాటని శ్రీరాముడిలా ప్రభాస్ కూడా అమ్మ చెప్పిన మాట విని అనుష్కను పెళ్లి చేసుకోలేదని టైమ్స్ నౌ కథనంలో వెల్లడించింది . 'ఆదిపురుష్’ సినిమా ప్రమోషన్స్ సమయంలో ప్రభాస్, కృతి సనన్ కెమిస్ట్రీ చూసి వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకున్నారు. ఆ సమయంలో ప్రభాస్ పట్ల కృతి సనన్ కేరింగ్ చూసిన ప్రతి యొక్కరు వీళ్లు రిలేషన్ లో ఉన్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయాన్ని అన్‌స్టాపబుల్ షోలో ప్రభాస్‌ను బాలకృష్ణ అందరి ముందు అడిగేశారు. అలాంటిది ఏం లేదని ప్రభాస్ తేల్చి చెప్పేసారు. దీంతో ఈ రూమర్‌కు ఫుల్‌స్టాప్ పడింది. కానీ, ఇప్పుడు మళ్లీ ప్రభాస్-అనుష్క పెళ్లి తెరమీదికి వచ్చింది. నిజంగా జాతకాలు కలవకపోతే వారిద్దరూ రహస్యంగా చేసుకున్న ప్రమాణం ప్రకారం జీవితాంతం ఒంటరిగా ఉండిపోతారా? అనేది చూడాలి.

Next Story