రాజమౌళి, మహేష్ సినిమా అప్‌డేట్.. అతిథి పాత్రలో మార్వెల్ హీరో..

by Javid Pasha |
రాజమౌళి, మహేష్ సినిమా అప్‌డేట్.. అతిథి పాత్రలో మార్వెల్ హీరో..
X

దిశ, వెబ్‌డెస్క్: బాహుబలితో పాన్ ఇండియా రేంజ్‌లో రాజమౌళి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీతో జక్కన్న ఫ్యాన్‌బేస్ అంతకంతా పెరిగిపోయింది. అయితే ప్రస్తుతం జక్కన్న తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మహేష్‌తో ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా ఆఫ్రికా అడవి ప్రాంతంలో మేజర్ పార్ట్ తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి నెట్టింట మరో వార్త తెగ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అతిథి పాత్రలోకి మార్వెల్ స్టార్ హీరో కనిపించనున్నాడట. నెవ్వర్ బిఫఓర్ యాక్షన్ అడ్వేంచర్‌ మూవీగా తెరకెక్కుతున్న రాజమౌళి, మహేస్ మూవీలో మార్వెల్ స్టార్ థోర్ క్రిస్ హెమ్స్‌వర్త్ కనిపించనున్నాడట.

ఇందులో క్రిస్ కనిపించినంత సేపు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో కట్టిపడేస్తుందని, అంతేకాకుండా ఈ సినిమాలో క్రిస్ హెమ్స్‌వర్త్‌తో పాటు మరికొందరు హాలీవుడ్ స్టార్ హీరోలు కూడా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలెక్కనుంది. అంతేకాకుండా ఈ సినిమాపై మేకర్స్ ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. మరి త్వరలో ఈ సినిమాపై మేకర్స్ ఏమైనా అప్‌డేట్ ఇస్తారేమో చూడాలి.

Also Read : 'భారతీయుడు 2'.. కమల్‌కు భారీ రెమ్యునరేషన్

Next Story

Most Viewed