తండ్రైన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్..

by Kavitha |
తండ్రైన టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ గుడ్ న్యూస్ తెలిపారు.. ఆయన భార్య డాక్టర్ పల్లవి.. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. హైదరాబాద్‍లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నేడు (ఫిబ్రవరి 21) వారికి కుమారుడు జన్మించారు. దీంతో నిఖిల్, పల్లవి తొలిసారి తల్లిదండ్రులయ్యారు. కాగా ఈ విషయాన్ని నిఖిల్ అధికారికంగా తన సోషల్ మీడియాలో వెల్లడించారు. అలాగే తన కుమారుడిని ఎత్తుకుని ప్రేమగా ముద్దు పెట్టుకుంటున్న ఓ ఫోటోను కూడా షేర్ చేశాడు. దీంతో నిఖిల్‍, పల్లవి దంపతులకు ఫ్యాన్స్, నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. అలాగే ఈ దంపతులిద్దరి కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆసుపత్రికి వెళ్లి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.


Next Story