కవలలకు జన్మనిచ్చిన బాలయ్య హీరోయిన్..

by Disha Web Desk 6 |
కవలలకు జన్మనిచ్చిన బాలయ్య హీరోయిన్..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నమిత 'జెమిని' సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సింహా, బిల్లా వంటి చిత్రాలో తన నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2017లో వీరేంద్ర చౌదరి అనే ఆర్టిస్ట్‌ని పెళ్లి చేసుకుంది. అయితే, ఇటీవలే తాను తల్లిని కాబోతునట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా, శుక్రవారం కృష్ణాష్టమి రోజున తాను కలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా నమిత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసి అభిమానులతో పంచుకుంది.

అంతే కాకుండా ''నాకు ట్విన్ బాయ్స్ పుట్టారు. ఇవాళ కృష్ణాష్టమి రోజు మీ అందరికీ చెప్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ అందరి బ్లెస్సింగ్స్, ప్రేమానురాగాలు నా పిల్లలకి కూడా కావాలి. నా ప్రెగ్నెన్సీ టైంలో నాకు సపోర్ట్ చేసి, నన్ను జాగ్రత్తగా చూసుకున్న హాస్పిటల్, డాక్టర్స్‌కి, నా ఫ్యామిలీ మెంబర్స్‌కి ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చింది. దీంతో నెటిజన్లు, సినీ ప్రముఖులు 'శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Next Story

Most Viewed