పూల డ్రెస్‌లో ట్రెండీ లుక్.. ఎద అందాలతో కట్టిపడేస్తున్న పొలిమేర హీరోయిన్

by sudharani |
పూల డ్రెస్‌లో ట్రెండీ లుక్.. ఎద అందాలతో కట్టిపడేస్తున్న పొలిమేర హీరోయిన్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ‘మా ఊరి పొలిమేర’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో వరుస ఆఫర్లు అమ్మడు చుట్టుముట్టడంతో.. ‘రౌడీ బాయ్స్, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం, విరుపాక్ష’ వంటి వరుస చిత్రాలతో సందడి చేసింది. ఇక ఈ ఏడాది ‘మా ఊరి పొలిమేర 2’ తో పాటు ‘ఓం భీమ్ బుష్’ మూవీలో నటించి మరోసారి ప్రేక్షకులను భయపెట్టింది.

ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇన్‌స్టా వేదికగా అభిమానులకు అందుబాటులో ఉంటుంది ఈ బ్యూటీ. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ను ప్రేక్షకులతో పంచుకోవడంతో పాటు.. అప్పుడప్పుడు గ్లామర్ ట్రీట్‌తో ఆకట్టుకుంటుంది. అలాగే ఎప్పటికప్పుడు తన ప్రత్యేకమైన ఫ్యాషన్‌తో కుర్రాళ్లను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇందులో భాగంగానే మరోసారి తన ఫ్యాషన్ షోతో యువతను మెస్మరైజ్ చేసే ప్రయత్నం చేసింది కామాక్షి. పూల నమూనాలతో అలంకరించబడిన ట్రెండీ అవుట్ ఫిట్‌లో దర్శనమిచ్చిన ఈ అమ్మడు ఎద అందాలు చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ కావడంతో.. ‘ఆ నవ్వు చాలా హృదయాలను చంపేస్తుంది’ అని ‘కళ్లు తిప్పుకోలేకపోతున్నాం’ అని కామెంట్స్ పెడుతున్నారు.Next Story

Most Viewed