నేను గ్లామర్ రోల్ చెయ్యడానికి కారణం అదే.. యంగ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్

by sudharani |
నేను గ్లామర్ రోల్ చెయ్యడానికి కారణం అదే.. యంగ్ హీరోయిన్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వన్ ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ‘శతమానం భవతి’ మూవీతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటుంది. ఇక వరుస సినిమాలతో సందడి చేస్తున్న అనుపమ.. తన స్టైల్ కూడా మార్చేసింది. మొదట్లో ఎంతో సంప్రదాయబద్ధంగా లంగా ఓణీలో కనిపించి కుర్రాళ్లను ఆకట్టుకున్న ఈమె.. ‘రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్’ మూవీలో తనలోని మరో యాంగిల్ బయటపెట్టింది. బోల్డ్, ముద్దు సీన్స్‌లో నటించి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది. అయితే.. టిల్లు స్క్వేర్ మూవీలో అనుపమ నటనకు ప్రశంసలు వచ్చినప్పటికీ.. బ్యూటీ లుక్‌కు డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రం తెగ హర్ట్ అయిపోయారు.

‘నీలో ఓ సావిత్రిని, సౌందర్యను చూసుకున్నాం. ఇప్పుడు నువ్వు ఇంతలా చేంజ్ అయ్యి.. బోల్డ్ సీన్స్ చేస్తూ.. గ్లామర్ డోస్ పెంచేస్తే తట్టుకోలేకపోతున్నాం’ అంటూ కామెంట్స్, వీడియోస్‌తో రచ్చ చేశారు. అయితే.. ఇలా ఫ్యాన్స్ నిరుత్సాహం చెందడంతో.. ఎక్కడికి వెళ్లిన అను బేబీకి గ్లామర్ రోల్స్‌పై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ గ్లామర్ రోల్‌పై స్పందించింది. ‘నేను కెరియర్ ప్రారంభంలో డీసెంట్ పాత్రలలో నటించాను. ఇప్పుడు గ్లామర్ పాత్రలు చేస్తున్నాను. అలా ఎందుకు నటిస్తున్నానా అని చాలామంది అనుకుంటున్నారు. ఒకే రకం పాత్రలలో నటిస్తే బోర్ కొడుతుంది. అలాగే నటిగా నన్ను నేను ప్రూవ్ చేసుకొని అవకాశం కూడా లేకుండా పోతుంది. అందుకే డిఫరెంట్ పాత్రలలో నటిస్తున్నాను. కేవలం క్లాస్ పాత్రలలో కానీ, అన్ని రకాలైన పాత్రలల్లో నటించాలి అనేది నా ఉద్దేశం’ అంటూ గతంలో చెప్పుకొచ్చిన అనుపమ కామెంట్స్ మరోసారి నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.Next Story

Most Viewed