నాకు ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లయ్యాయి.. వారంతా రెంట్ ఇచ్చేసి వెళ్లిపోతే బాగుండు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

by Disha Web Desk 9 |
నాకు ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లయ్యాయి.. వారంతా రెంట్ ఇచ్చేసి వెళ్లిపోతే బాగుండు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: అతి తక్కువ సమయంలో స్టార్ గుర్తింపు దక్కించుకున్న హీరోయిన్ అంజలికి ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా అద్భుతంగా నటించి.. తన నటనతో ప్రేక్షకులందర్ని కట్టిపడేసింది. ఇకపోతే అంజలి గీతాంజలి-2 (ఏప్రిల్ 11కి విడుదల) తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ఈవెంట్ నిర్వహించగా.. ఈ కార్యక్రమంలో అంజలి పాల్గొంది. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చర్చించిన అనంతరం.. ఈ హీరోయిన్ పెళ్లిపై వస్తోన్న సోషల్ మీడియాలోని రూమర్ల గురించి ప్రశ్నించారు.

ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికే నాకు నాలుగు పెళ్లిళ్లు అయిపోయాయి. ఇప్పుడు ఐదో పెళ్లి కూడా చేసేస్తున్నారు. మరీ నా పెళ్లికి నేను ఉండాలి కదా? నాకే చెప్పలేదు. చెబితే వచ్చేదాన్ని. దయచేసి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయొద్దు’’ అంటూ కాస్త ఫైర్ అవుతూ చెప్పుకొచ్చింది. అలాగే అంజలి ఎవరితోనో లివింగ్ రిలేషన్ లో ఉంటుందని, తన ఇంట్లో ఉండటం లేదని, ఔట్ డోర్ లో ఉంటుందని వచ్చే వార్తలపై కూడా స్పందించింది. ‘నాతో ఉంటున్న వారెవరో మరీ నాకు రెంట్ ఇచ్చేసి వెళ్లినా బాగుండు. ఈ డబ్బుతో ఈఎంఐలు అయినా కట్టుకునేదాన్ని’. అంటూ అంజలి.. తనపై రూమర్స్ క్రియేట్ చేసేవాళ్లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.


Next Story

Most Viewed