- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Jason Sanjay: డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరో తనయుడు
దిశ, వెబ్‌డెస్క్: హీరో దళపతి విజయ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. కేవలం కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాల్లో నటించి.. ప్రేక్షకుల మెప్పు పొందాడు. విజయ్ సినిమాలకు స్పెషల్ ట్రెండ్ ను సృష్టించుకున్నాడు. ఇకపోతే ఈ హీరో తనయుడు జాసన్ సంజయ్ కూడా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా జాసన్ ఎంట్రీ గురించి క్లారిటీ వచ్చేసింది. ఏకంగా దళపతి కుమారుడు డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. డెబ్యూ దర్శకుడిగా అదిరిపోయే కథను డైరెక్ట్ చేస్తున్నాడట. జాసన్ మొదటి సినిమాను కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్త ప్రొడక్షన్ హౌస్ లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా నటించబోతున్నారట. అలాగే ఈ మూవీకి తమన్ సంగీతాన్ని సమకూర్చుతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారట. స్టార్టింగ్ లో చియాన్ విక్రమ్ ను హీరోగా అనుకున్నారట. కానీ పలు కారణాల వల్ల విక్రమ్ ఈ మూవీ నుంచి తప్పుకున్నారట. ఆ ప్లేస్‌లో సందీష్ కిషన్ ను తీసుకున్నారట. అయితే దర్శకుడు లోకేష్ కనగరాజ్ కూడా మొదటి సినిమా సందీప్ కిషన్ తోనే ‘మా నగరం’ తీశారు. ఇప్పుడు విజయ్ దళపతి కొడుకు కూడా ఆ హీరోతోనే మూవీ తీస్తుండటంతో లోకేష్ బాటలో నడుస్తున్నాడంటూ జాసన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.