హీరో Srikanth ఇంట్లో మొదలైన పెళ్లి సందడి !

by samatah |
హీరో Srikanth ఇంట్లో మొదలైన పెళ్లి సందడి !
X

దిశ, వెబ్‌డెస్క్ : ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచమైన వ్యక్తి శ్రీకాంత్. ఈయన విలన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక సినీ నటి ఊహను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ హీరోకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్న విషయం తెలిసిందే. అయితే శ్రీకాంత్ ఇంట్లో మొదలైన పెళ్లి సందడి అంటూ ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అసలు పెళ్లి ఎవరిదీ అనుకుంటున్నారా?

హీరో శ్రీకాంత్ స్వయానా తమ్ముడు అనిల్ మేక కూతురు పెళ్లి ఘనంగా జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. హీరో శ్రీకాంత్ తన తమ్ముడి కూతురు పెళ్లికి సతీ సమేతంగా హాజరైనట్లు ఆ ఫోటోల ద్వారా తెలుస్తోంది. ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారడమే కాదు త్వరలోనే మేధా పెళ్లి కూడా చూడాలి అని కొంతమంది కామెంట్లు చేస్తుంటే, మరి కొంతమంది లేదు ఆమెను హీరోయిన్గా చూడాలని కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Upasana ఇచ్చిన డైమండ్ రింగ్‌పై క్లారిటీ ఇస్తూ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టిన Tamannaah..

Next Story