మగ గొప్పా? ఆడ గొప్పా? అనేదే ఈ సినిమా.. చాలా చాలెంజింగ్‌గా అనిపించింది: శ్రీవిష్ణు

by sudharani |
మగ గొప్పా? ఆడ గొప్పా? అనేదే ఈ సినిమా.. చాలా చాలెంజింగ్‌గా అనిపించింది: శ్రీవిష్ణు
X

దిశ, సినిమా: కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీవిష్ణు, ట్యాలెంటెడ్ డైరెక్టర్ హసిత్ గోలి అప్ కమింగ్ హిలేరియస్ ఎంటర్ టైనర్ 'శ్వాగ్'. ఇందులో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా.. మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హ్యుజ్ బజ్ క్రియేట్ చెయ్యగా.. తాజాగా వచ్చిన ట్రైలర్ కూడా స్పెషల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 4న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉండటంతో తాజాగా మీడియాతో ముచ్చటించారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘శ్వాగ్.. అంటే శ్వాగనిక వంశానికి సుస్వాగతం. అంత పెద్ద టైటిల్‌ని పలకడానికి ఇబ్బందిగా ఉంటుందని షార్ట్‌గా 'శ్వాగ్' అని టైటిల్ పెట్టాం. శ్వాగ్ ఒక వంశానికి సంబధించిన కథ. మాత్రు, పితృస్వామ్యం అనే క్లాష్ నుంచి 1500 సంవంత్సవంలో మొదలయ్యే కథ. మగ గొప్పా? ఆడ గొప్పా? అనే అంశంపై చిన్న టిట్ ఫర్ టాట్ లాంటి కథ. తెలుగు ప్రేక్షకులు కొత్త కథ ఎప్పుడు చెప్పినా ఆదరించారు. అదే ధైర్యంతో ఈ సినిమా చేయడం జరిగింది. నేను ఇందులో నాలుగు పాత్రలు చేశాను. నాలుగు పాత్రలు చేయడం చాలా చాలెంజ్‌గా అనిపించింది. ఇంటిల్లిపాది చూడదగ్గ సినిమా ఇది. ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. మన వంశం గురించి, పెద్దల గురించి, తాతల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటనేది ఇందులో చాలా చక్కగా చూపించడం జరిగింది. ఈ ప్యూర్ కంటెంట్ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed