పెండ్లి పీటలెక్కబోతున్న హీరో శర్వానంద్.. ఆ మాజీ ఎమ్మెల్యే మనవరాలితో పెళ్లి ఫిక్స్..!!

by Disha Web Desk 19 |
పెండ్లి పీటలెక్కబోతున్న హీరో శర్వానంద్.. ఆ మాజీ ఎమ్మెల్యే మనవరాలితో పెళ్లి ఫిక్స్..!!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇప్పటి వరకు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాటలర్‌గా ఉన్న ఈ యంగ్ హీరో.. అతి త్వరలోనే పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా శర్వానంద్ పెళ్లికి సంబంధించి అనేక వార్తలు రాగా.. తాజాగా మాత్రం శర్వా పెళ్లి చేసుకోబోయే యువతి పూర్తి వివరాలు బయటికొచ్చాయి. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కూతురు రక్షిత రెడ్డి అనే యువతిని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సినీ సర్కిల్స్‌లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే, శర్వానంద్ వివాహమాడానున్న రక్షిత రెడ్డి శ్రీకాళహస్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, దివంగత నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మనవరాలని సమాచారం. అంతేకాకుండా ఈనెల 26వ తేదీన హైదరాబాద్‌లో శర్వానంద్ ఎంగేజ్ మెంట్ జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా, పెళ్లికి సంబంధించిన వార్తలపై హీరో శర్వానంద్ అయితే ఇప్పటివరకు స్పందించలేదు. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే శర్వానంద్ స్పందించే వరకు ఆగాల్సిందే.

Read Disha E-paper

Next Story

Most Viewed