నేను ఆ బాపతి కాదంటూ.. స్టార్స్ ఫ్యామిలీపై జోక్ వేసిన యంగ్ హీరో..

by Sujitha Rachapalli |
నేను ఆ బాపతి కాదంటూ.. స్టార్స్ ఫ్యామిలీపై జోక్ వేసిన యంగ్ హీరో..
X

దిశ, సినిమా: యంగ్ హీరో హర్షవర్ధన్ రాణే ప్రస్తుతం సైకాలజీ చదువుతున్నాడు. ఇందుకు సంబంధించిన పరీక్షలు రాస్తున్నట్లు లేటెస్ట్ పోస్ట్ పెట్టాడు. 80 పర్సంటేజ్ మార్క్స్ స్కోర్ చేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఇంటికి సంబంధించిన ఫొటోలు పోస్ట్ చేయగా.. ' ఇది మీ సొంత బంగ్లానా ' అని అడిగారు నెటిజన్లు. ఇక దీనిపై స్పందించిన ఆయన.. ' నా లాస్ట్ నేమ్ కపూర్స్ కాదు ' అని చెప్పాడు. అంటే కపూర్స్ కు అలాంటి ఇల్లు ఉంటుంది మనకెందుకు ఉంటుందని సమాధానమిచ్చాడు.

గత పది నెలలుగా చాలా కష్టపడి చదువుతున్నానని.. ఇకపై రాయబోయే పరీక్షలు ఎలా రాస్తానో తెలియదన్నాడు. కాగా చదువుకుంటున్న ఫోటోలపై రియాక్ట్ అయిన జనాలు.. ఇంత సిన్సియర్ గా చదువుకుంటున్నావని కామెంట్స్ చేస్తున్నారు. కాగా యాక్టర్ గా సెటిల్ అయిన హర్షవర్ధన్ కు సైకాలజీ చదవాలనే కోరిక ఉండగా.. ఆ కలను ఇప్పుడు నెరవేర్చుకుంటున్నట్లు గతంలో చెప్పాడు. షూటింగ్ బ్రేక్స్ లో చదువుకుంటానని.. ఆన్ లైన్ లో క్లాసులు వింటానని తెలిపాడు.
Next Story