ధనుష్ పాన్ ఇండియా మూవీ ‘రాయన్’ సెన్సార్ పూర్తి.. వారికి నో ఎంట్రీ!

by Hamsa |
ధనుష్ పాన్ ఇండియా మూవీ ‘రాయన్’ సెన్సార్ పూర్తి.. వారికి నో ఎంట్రీ!
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ విభిన్న కథలను ఎంచుకుంటూ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ చేస్తున్నాడు. ముఖ్యంగా నెగిటివిటీకి దగ్గరగా ఉండే పాత్రల్లో నటిస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవల ఆయన కెప్టెన్ మిల్లర్ జనవరి 12న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ధనుష్ ‘రాయన్’ పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆయన హీరోగా నటిస్తూ.. డైరెక్షన్ కూడా చేస్తున్నాడు. ఇందులో దుషారా విజయన్, అపర్ణ బాలమురళి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఇప్పటికే రాయన్ మూవీ నుంచి విడుదలైన అప్డేట్స్ అన్ని ఆసక్తికరంగా మారాయి.

అయితే రాయన్ జూలై 26న పాన్ ఇండియా మూవీగా వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పూర్తి చేసుకుని మేకర్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. రాయన్ చిత్రంలో రక్తపాతం, హింసాత్మక సన్నివేశాలు ఉండటంతో దీనికి A సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే.. 18 ఏళ్ల వయస్సులోపు ఉన్న వారికి అనుమతి లేదన్నమాట. కేవలం పెద్దలకు మాత్రమే ఈ సినిమాను చూసే అవకాశం ఉంది. ఇక ఈ విషయం తెలిసిన కొందరు షాక్ అవుతున్నారు.

Next Story

Most Viewed