ఆమె మరణం నా మనసును ఎంతో కలిచివేసింది.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ ట్వీట్

by Hamsa |   ( Updated:2024-10-05 10:17:05.0  )
ఆమె మరణం నా మనసును ఎంతో కలిచివేసింది.. సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఆయన కూతురు గాయత్రి హఠాత్తుగా గుండెపోటుతో మరణించింది. అయితే గాయత్రి తమ కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో రాజేంద్ర ప్రసాద్ దంపతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రాజేంద్ర ప్రసాద్ ఇంటికి వెళ్తున్నారు.

ఈ క్రమంలో.. తాజాగా, మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘X’ వేదికగా గాయత్రి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. ‘‘నాకు అత్యంత ఆప్తులు శ్రీ రాజేంద్రప్రసాద్ కూతురు గాయత్రి హఠాన్మరణం మనసును ఎంతో కలిచివేసింది. కూతురు లోనే అమ్మను చూసుకున్న ఆయనకు ఇలాంటి కష్టం రావడం అత్యంత బాధాకరం. ఆయనకు నా ప్రగాఢ సంతాపం. ఈ కష్ట సమయాన్ని తట్టుకుని నిలబడే మనోస్థైర్యాన్ని , ధైర్యాన్ని దేవుడు ఆయన కుటుంబానికి ఇవ్వాలని మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నాను’’ అని రాసుకొచ్చారు.


👉 Click Here For Tweet

Advertisement

Next Story