తాప్సీపై దారుణంగా ట్రోల్స్.. లక్ష్మీదేవి ఆభరణం అక్కడ ధరించడంపై ఫైర్

by Anjali |
తాప్సీపై దారుణంగా ట్రోల్స్.. లక్ష్మీదేవి ఆభరణం అక్కడ ధరించడంపై ఫైర్
X

దిశ,వెబ్‌డెస్క్: టాలీవుడ్ చొట్టబుగ్గల బ్యూటీ తాప్సీ తెలుగులో పలు సినిమాల్లో నటిస్తూనే బాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ నటి వరుస సినిమాలతో అలరిస్తోంది. తాజాగా ఈ భామ లాక్మే ఫ్యాషన్ వీక్‌లో పాల్గొని, రెడ్ డ్రెస్‌లో క్లీవేజ్ అందాలతో ఫోజులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తార పొడవైన డ్రెస్ ధరించినప్పటికీ క్లీవేజ్‌ను కవర్ చేయడానికి తను ఓ భారీ ఆభరణం ధరించింది. ఆమె ధరించిన ఆభరణంలో హిందువులు పవిత్రంగా కొలిచే లక్ష్మీదేవి బొమ్మ ఉంది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. అసభ్యరమైన దుస్తులపై పవిత్రమైన లక్ష్మీ మాత ఆభరణం ధరించడం ఏమిటి అంటూ తాప్సీని తిట్టిపోస్తున్నారు. ఎప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడే తను ఇలాంటి విషయాల పట్ల ఎలా నడుచుకోవాలో కూడా తెలిసి ఉండాలి కదా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more:

Mrunal Thakur: అవమానం భరించలేక కన్నీరు పెట్టుకున్నా.. సీతా ఎమోషనల్

Next Story