ఆ పండుగ రోజున రాబోతున్న 'హరిహర వీరమల్లు' స్పెషల్ ప్రోమో..!

by Kavitha |   ( Updated:2024-02-19 02:53:40.0  )
ఆ పండుగ రోజున  రాబోతున్న  హరిహర వీరమల్లు స్పెషల్ ప్రోమో..!
X

దిశ, సినిమా: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2020 సెప్టెంబర్‌‌న ఈ మూవీ షూటింగ్ మొదలవ్వగా ఆ తర్వాత కరోనా వైరస్ ప్రభావంతో చిత్రీకరణ నిలిచిపోయింది. అనంతరం వివిధ కారణాలతో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వస్తోంది. పవన్ కల్యాణ్ ఇతర చిత్రాలకు డేట్లు కేటాయించడం, రాజకీయంగా బిజీ కావడంతో ‘హరిహర వీరమల్లు’ ఆగిపోయింది. దీంతో ఈ సినిమా రద్దయిందని పుకార్లు చక్కర్లు కొట్టాయి.

కానీ ఈ పుకార్లకు చెక్ పెడుతూ అదిరిపొయే అప్‌డేట్ ఇచ్చారు మోకర్స్..త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకొస్తామని మెగా సూర్య ప్రొడక్షన్స్ తెలిపింది. అయితే తాజాగా ఈ సినిమా ప్రత్యేక ప్రోమో మహా శివరాత్రి రోజున మార్చి 8న రానుందని తెలుస్తోంది. ఆ పర్వదినాన ప్రోమోను తీసుకురావాలని మూవీ టీమ్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై అధికారిక ప్రకటన రానప్పటికీ మార్చి 8న ప్రోమో వస్తోందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

Next Story

Most Viewed