Guppedantha Manasu : ఇలాంటి పనులు ఎలా చేస్తావ్ అంటూ వసుధారను నిలదీసిన తోటి ఉపాధ్యాయులు

by Prasanna |
Guppedantha Manasu : ఇలాంటి పనులు ఎలా చేస్తావ్ అంటూ వసుధారను నిలదీసిన తోటి ఉపాధ్యాయులు
X

దిశ, సినిమా : గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

దీంతో వసుధార.. ‘ఆపండీ..ఏం జరుగుతుంది ఇక్కడ ఇదంతా అబద్దమే.. దీనిలో నిజం లేదు ’ అని అంటుంది. ముందు మీరు ఆపండి ‘మీ మాటలు ఎవరు నమ్మరు.. అసలు మీరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో ఇక్కడ ఎవరికీ అర్ధం కావడం లేదు.. రిషి సార్ చనిపోయారని మేమందరం సంతాప సభ పెడితే.. మీరేమో రిషి సార్ నా ప్రాణం.. నా గుండె .. నేను ఉన్నానంటే రిషి సార్ బతికి ఉన్నట్టే అని ఏవేవో చెప్పారు. అప్పుడు సంతాప సభని జరగకుండా చేశారు. రిషి సార్ నిజంగా మీ ప్రాణం అయితే.. మీరు చేసేవి ఇలాంటి పనులా ’ అంటూ మహిళా సిబ్బంది వసుధారని ఏకిపారేస్తుంటారు. దీంతో మహేంద్ర.. ‘ఏయ్ ఆపుతారా .. అసలు వసుధార గురించి మీకు ఏం తెలుసు’ అని గట్టిగా అరుస్తాడు.

అప్పుడు, ఇప్పుడు వసుధారకి రిషి అంటే ప్రాణమని చెబుతాడు. “ఇంతకీ ఆ ప్రేమ ఏమైంది సార్? చనిపోయిందా? లేక లేదా తప్పిపోయిందా? మీరు తప్పు చేసినప్పుడు మీ స్థాయి గురించి ఆలోచించాలి కదా .. మీరు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు అలాంటి పనులు ఎలా చేస్తారు? విద్యార్థులు మిమ్మల్ని చూసి ఇలాంటి విషయాలు నేర్చుకోవాలా? అని కాలేజ్ యాజమాన్యం అడుగుతారు. అప్పుడు మహేంద్ర ఎందుకు ఇంత దారుణంగా మాట్లాడుతున్నావ్?ఎక్కడో తప్పు జరిగిందని అంటాడు

Next Story

Most Viewed