Guppedantha Manasu: మనుగారితోనే డిస్కస్ చేస్తా అంటూ శైలేంద్ర మీద ఫైర్ అయినా వసుధార

by Prasanna |
Guppedantha Manasu: మనుగారితోనే డిస్కస్ చేస్తా అంటూ శైలేంద్ర మీద ఫైర్ అయినా వసుధార
X

దిశ, ఫీచర్స్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

శైలేంద్ర.. ‘గుడ్ మార్నింగ్ మనూ గారూ’ అంటూ హీరో లా ఎంట్రీ ఇస్తాడు. ‘హలో వసుధారా.. గుడ్ మార్నింగ్.. ఏంజల్ గారూ.. అయినా మీరు ఇక్కడ ఉన్నారేంటి.. ఈ కాలేజ్‌కి, మీకు సంబంధం ఏంటని శైలేంద్ర అడుగుతాడు. ఏంటో ఈ మధ్య కొత్త కొత్త వాళ్లంతా సత్రానికి వచ్చి నట్టు కాలేజ్ కి వస్తున్నారు. ఈ కాలేజ్‌ అసలు డీబీఎస్టీ కాలేజ్‌నా కదా అనే సందేహం వస్తుంది నాకు. సర్లే.. మీరు దేని గురించో మాట్లాడుకుంటున్నట్టు ఉన్నారుగా.. బాగా మాట్లాడుకోండి.. కానియ్యండి’ అని శైలేంద్ర అంటాడు. దాంతో వసుధార మండిపడితూ.. ‘ఏంటీ ఎక్కువ మాట్లాడుతున్నావ్.. లిమిట్స్ లో ఉండు అని వార్నింగ్ ఇస్తుంది.

దాంతో శైలేంద్ర.. ‘బాగా సంతోషంలో ఉన్నట్టు ఉన్నారూ.. అదేదో నాకు చెబితే, నేను కూడా నేను కూడా సంతోషిస్తా కదా’ అని అంటాడు. సంబంధం లేకుండా ‘డిస్కషన్‌లోకి రావడం నీకు ఇష్టమేమో.. కానీ నీతో డిస్కస్ చేయడం మాకు అసలు ఇష్టం లేదు.. మేం మాత్రమే డిస్కస్ చేసుకుంటాం.. ఇక మీరు దయ చెయ్యొచ్చు అని వసుధార అంటుంది. ఆ మాటతో మను వసుధార వైపు చూస్తూ బాగా నవ్వుతాడు. పాపం శైలేంద్రకి ఏమి మాట్లాడాలో తెలియక .. ‘చేయండి చేయండి.. బాగా సంతోషపడండి.. ఎన్నాళ్లు పడతారో చూస్తా.. నేను రాజీవ్ వేసిన ప్లాన్‌తో మీకు దిమ్మతిరిగి బొమ్మ కనపడుతుంది’ అని మనసులో అనుకుంటూ అక్కడే ఉంటాడు శైలేంద్ర.

Next Story

Most Viewed