Guppedantha Manasu: మిమ్మల్ని కలవాలి మను.. అంటూ ఫోన్ చేసిన వసుధార

by Prasanna |
Guppedantha Manasu:  మిమ్మల్ని కలవాలి మను.. అంటూ ఫోన్ చేసిన వసుధార
X

దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

‘నేను వసుధారని.. ఈ రోజు మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను’ అని వసుధార అంటుంది. ‘ఏ విషయం మీద.. అని అడుగుతాడు మను. ‘నేను కలిసినప్పుడు చెబుతా అని వసుధార అంటుంది. దాంతో మను.. ‘ఓకేనండీ.. చెప్పండి నన్ను ఎక్కడికి రమ్మంటారు? అని అడుగుతాడు. ఆగండి ‘నేను మళ్లీ ఫోన్ చేసి టైం లొకేషన్ చెప్తాను’ అని వసుధార అంటుంది. సరే వెయిట్ చేస్తాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇక మను దగ్గర రూ.50 కోట్లు చెక్ తీసుకున్న వాళ్లిద్దరూ.. శైలేంద్రకి ఆ చెక్‌ని ఇచ్చి.. 'ఇదేంటి సార్.. మీకు రూ.50 కోట్లు సంపాదించి పెడితే మాకు కోటి ఇస్తాననడం అస్సలు బాగాలేదు సార్’ అని అంటాడు.

“అయ్యో.. నీకు కోటి రూపాయలు సరిపోతుందా?” నీ కష్టాన్ని కాపాడతాను కానీ పదివేలు ఇస్తాను అంటాడు శైలేంద్ర. ఇద్దరు వ్యక్తులు, “ఇంకా పదివేలు ఎంత సార్, మొత్తం నిర్ణయించండి సార్?” అని అడిగారు. మను అనే కొత్త పాత్ర వేదికపైకి వచ్చి, “నేను కూర్చోవాలా?” అని అడిగాడు. శైలేంద్ర , అతన్ని చూసి షాక్ అవుతాడు. మను శైలేంద్రతో ఇలా అంటాడు. "నేను అలాంటి డబ్బు వ్యవహారాలను బాగా సెట్ చేయగలను.

అయినా మీ కాలేజ్‌ని లాక్కోవాలన్న వాళ్లతో నువ్వు మాట్లాడుతున్నావ్ ఏంటి అని అడుగుతాడు. అదేం లేదు.. ‘ఇంకెప్పుడూ మాకాలేజ్ వైపు రావొద్దని వీళ్లకి వార్నింగ్ ఇస్తున్నా’ అని శైలేంద్ర అంటాడు. ‘అవును అవును.. అదే మాట్లాడుతున్నారు’ అని అంటాడు ఆ ఇద్దరు వ్యక్తులు. దాంతో మను.. అవునా.. చెక్.. మీ చేతుల్లోకి ఎలా వచ్చిందని అడుగుతాడు.

Next Story