- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Guppedantha Manasu: మనుని వెతుక్కుంటూ వెళ్లిన వసుధార..

దిశ, సినిమా: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్
మను పేరు చెబితేనే కోప పడుతున్న వసుధార.. ఎక్స్యూజ్ మీ అంటూ మను క్యాబిన్‌లోకి వెళ్తుంది. కానీ అక్కడ మను ఉండడు. ‘మను గారు లేరేంటి? ఉదయం కాలేజ్ కి వచ్చారు కదా.. ఇంతలోనే ఎక్కడికి వెళ్లారు? అని ఆలోచిస్తూ వెనక్కి తిరుగుతుంది. అప్పుడే మను క్యాబిన్‌లోకి వస్తాడు. ఇద్దరూ ఒకరికొకరు ఎదురు పడటంతో.. ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటారు. ఏంటి వీళ్ల మధ్య ప్రేమ మొదలవుతుందా .. వీళ్ల చూపులు.. మాటలు.. చూస్తుంటే చాలా తేడాగానే ఉంది. రిషి ఇక సీరియల్లోకి రానట్లేనా ? చూడబోతుంటే అలాగే ఉంది. ‘ఏంటి మేడమ్.. మీరు నా క్యాబిన్‌కి వచ్చారు? అని అడుగుతాడు మను. ‘ఏ.. నేను మీ దగ్గరకు రాకూడదా? అని అడుగుతుంది.
అంటే మీకు నా క్యాబిన్‌కి రావడం ఇష్టం లేదు కదా.. అని మను అంటాడు. ‘అలా ఏం లేదండీ.. నేను మీతో మాట్లాడటానికే వచ్చాను’ వసుధార అంటుంది. ‘అవునా.. సరే రండి ’ మను అంటాడు. ఆ తరువాత ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ‘థాంక్స్ అండీ!! అని వసుధార అంటే.. ‘ఎందుకు మేడమ్ థాంక్స్ అని మను అంటాడు. మొదట్లో మిమల్ని తప్పుగా అర్ధం చేసుకున్నాను. కానీ ‘మీ వల్ల మంచే జరిగింది’ అని వసుధార అంటుంది. ‘మంచి జరిగిందా? నా వల్లనా.. ఏం మంచి అని మను అడుగుతాడు. చేసిన సాయాన్ని గుర్తుపెట్టుకోకపోవడం మీ గొప్పతనం.. కానీ మర్చిపోయే అలవాటు నాకు లేదు’ అని వసుధార. ఇక్కడితో ఈ సీను ముగుస్తుంది.
Read More..