Guppedantha Manasu: నేను మీతో రాను అని.. మను మొఖం మీదే చెప్పిన వసుధార

by Prasanna |
Guppedantha Manasu: నేను మీతో రాను అని.. మను మొఖం మీదే చెప్పిన వసుధార
X

దిశ, సినిమా : గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

వసుధారకి నేను చెప్తాను.. ముందు కార్యక్రమాన్ని పూర్తి చేయండి.. అని ఫణేంద్ర అంటాడు. మహేంద్ర అయిష్టంగానే రిషికి కర్మకాండ చేస్తాడు. వసుధార కాలేజీకి వెళ్లబోతుంటే.. మను వచ్చి "మేడమ్, ఈ రోజు కాలేజీకి వెళ్లడానికి అనుమతి లేదు, దయచేసి నాతో రండి." ఏంటి మీరు నన్ను ఆర్డర్స్ చేస్తున్నారు? నేను మీతో ఎందుకు రావాలి? అని గట్టిగా అడుగుతుంది వసుధార. “వస్తే నీకే అర్థమవుతుంది.. ఇది చాలా ముఖ్యం.. నువ్వు వస్తే నీకు మంచి జరుగుతుందని మను అంటాడు. దయచేసి ఏంటో చెప్పండి.. అని వసుధార అంటే.. " చెప్తేనే వస్తావా?" లేదంటే రారా అని మను.

మిమ్మల్ని ఎందుకు నమ్మాలి అసలు? మాకు యాభై కోట్లు ఇచ్చారని మిమ్మల్ని నమ్మాలా? లేక డైరెక్టర్ కుర్చీలో కూర్చున్నారని నమ్మాలా? అసలు నేను మిమల్ని ఎందుకు నమ్మాలి ? ఈ కాలేజ్‌ని మీరు తీసుకోవాలనే కదా.. ఇంత చేస్తున్నారు.. అంటూ ఇష్ట మొచ్చినట్టు మాట్లాడుతుంది.. వసుధార. దీంతో మను.. ‘అయ్యో మీరు నన్ను అపార్ధం చేసుకుంటున్నారు.. నిజంగానే నేను కాలేజ్‌ని చేతుల్లోకి తీసుకోవాలని ఆలోచించే వాడ్నే అయితే.. మీ వరకు వచ్చేది కాదు .. ఆ పని ఎప్పుడో చేసేవాడ్ని.. ఇంత సమయం ఎందుకు వేస్ట్ చేస్తా .. అయినా ఇప్పుడు దాని గురించి ఎందుకు అండి.. మీరు నాతో పాటు రావాలని అంటాడు మను. ఇక్కడితో ఈ సీను ముగుస్తుంది.

Next Story

Most Viewed