గుప్పెడంత మనసు : వసు కోసం రౌడీలతో ఫైట్ చేసిన రిషి !

by Disha Web Desk 10 |
గుప్పెడంత మనసు : వసు కోసం రౌడీలతో ఫైట్ చేసిన రిషి !
X

దిశ, వెబ్ డెస్క్ : నేటి ఎపిసోడ్‌లో ఈ సీన్లు హైలెట్

ఇంట్లో వాళ్ల అందరు పడుకున్న తరవాత..వసును బయటికి పిలిచి..ఇద్దరు కారులో బయటికి వెళ్తారు..వసుధారా నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా డాడ్ నా దగ్గరికి వచ్చేసారు. అసలు ఇన్ని రోజులు మా డాడ్ లేకుండా ఎలా ఉన్నానో..అంటూ అన్ని విషయాలు వసుతో పంచుకుంటాడు.

అప్పుడు వసు.. జగతీ గురించి మాట్లాడాలనుకుంటుంది..కానీ రిషి కోసం చెప్పకుండా ఆగిపోతుంది. వెంటనే వసు..కారు ఆపమని చెబుతుంది. ఇద్దరు కిందకు దిగి.. ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు. అప్పుడే బైక్ మీద నలుగురు వచ్చి..వాళ్ళని లవ్ బర్డ్స్ అని పిలుస్తారు.. అప్పుడు ఇద్దరు దూరంగా వెళ్ళిపోతారు.

రొమాన్స్ కు విశాలమైన ప్లేస్ ఎక్కడా దొరకలేదా ? అంటూ వారిని ఎగతాళి చేస్తుంటారు..అప్పుడు రిషికి చాలా కోపం వస్తుంది. మన రిషి గారికి మామూలుగానే కోపం ఎక్కువ .. ఆ కోపంలో వాళ్ళని కొట్టడానికి వెళ్తాడు.. అప్పుడు హీరోయిన్ వసు వచ్చి కొట్టకండి సార్..వాళ్ళని వదిలేయండి అంటూ బ్రతిమిలాడుతూ ఉంటుంది. అదే సమయంలో రిషి షర్ట్ మీద ఆల్కహాల్ పడుతుంది. షర్ట్ మార్చుకోవడానికి ఇంటికి వస్తారు. అనుకోకుండా గౌతమ్ చూస్తాడు. సీరియల్ ఇలా సాగుతూ ఉంటుంది. తర్వాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.


Next Story

Most Viewed