Kasturi: ‘ఆంటీ’ అని పిలిస్తే అగౌరవ పరిచినట్లే: నెటిజన్లపై నటి ఫైర్

by Prasanna |
Kasturi: ‘ఆంటీ’ అని పిలిస్తే అగౌరవ పరిచినట్లే: నెటిజన్లపై నటి ఫైర్
X

దిశ, సినిమా: సోషల్ మీడియాలో నటీనటులపై ట్రోలింగ్ చేసేవారికి సీనియర్ హీరోయిన్ కస్తూరి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అంతేకాదు అనసూయను పలువురు ఆంటీ అని పిలవడంపై ఫైర్ అయింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. ‘ఆంటీ అని చిన్న పిల్లలు పిలవడానికి, దున్నపోతులా ఉన్న వ్యక్తులు పిలవడానికి చాలా తేడా ఉంది. వయసుతో సంబంధం లేకుండా ఏ మహిళైనా ఆంటీ అని పిలిస్తే.. అది ఖచ్చితంగా వారిని అగౌరవ పరచినట్లే. అనసూయ కన్నా రెట్టింపు వయసున్న హీరోలున్నారు. వాళ్లను అంకుల్ అని పిలవగలరా? ముమ్మాటికి ఈ విషయంలో నేను అనసూయకు సపోర్ట్ చేస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story

Most Viewed