పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ రిలీజ్ కానున్న 'జల్సా'

by Disha Web |
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మళ్లీ రిలీజ్ కానున్న జల్సా
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం పాత సినిమాలను రీరిలీజ్ చేయడం లేటెస్ట్ ట్రెండ్‌ గా మారింది. అయితే ఇప్పటికే 'పోకిరి' చిత్రాన్ని మహేష్ బాబు పుట్టిన రోజున ఆగస్టు 9న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జల్సా' సినిమా కూడా రీరిలీజ్ చేస్తునట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఓ డైరెక్టర్ తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. 'జల్సా' సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున సెప్టెంబర్ 2న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తునట్టు సమాచారం.

పవన్ పుట్టిన రోజు దగ్గర పడుతుండటంతో 'జల్సా' సినిమాపై సాయి రాజేష్ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ''కొత్త ప్రింట్‌లో బాబు కొత్తగా కొన్న అద్దంలా మెరిసిపోతున్నాడు. సౌండ్ క్వాలిటీ అద్భుతంగా ఉంది. మీ సెలబ్రేషన్స్ మొదలు పెట్టండి'. షోలు, పబ్లిసిటీని సీనియర్ ఫ్యాన్స్ నిర్వహిస్తారు. ఇక నుంచి సంజయ్ సాహు రాక కోసం నేను ఎలాంటి బాధ్యత తీసుకోను' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అది చూసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

కోకా 2.0 లో దుమ్ము లేపిన అనన్య, విజయ్.. ఫ్యాన్స్ ఫిదా

Next Story

Most Viewed