బిగ్ బాస్ అభిమానులకు గుడ్ న్యూస్: తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్స్‌గా వచ్చేది వీళ్లే!

by Kavitha |
బిగ్ బాస్ అభిమానులకు గుడ్ న్యూస్: తెలుగు సీజన్ 8లో కంటెస్టెంట్స్‌గా వచ్చేది వీళ్లే!
X

దిశ, సినిమా: తెలుగులోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్. సాధారణంగా బిగ్ బాస్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు బిగ్‌బాస్ 7 సీజన్లు కంప్లీట్ చేసుకోగా త్వరలో సీజన్ 8 రాబోతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి సీజన్ కు ఎన్టీఆర్ ఆ తర్వాత సీజన్ కి నాని హోస్ట్ చేశారు . ఆ తర్వాత అన్ని సీజన్స్ కి నాగార్జున నే హోస్టింగ్ చేశారు. కాగా ఇప్పుడు ఈ సీజన్ కి హోస్ట్ గా మళ్లీ అక్కినేని నాగార్జున నే హోస్ట్ చేయబోతున్నాడు అంటూ ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

ఇదిలా ఉండగా ఈసారి బిగ్ బాస్‌లో కంటెస్టెంట్స్‌గా ఎవరు వస్తారు అనేదానిపై పలువురి పేర్లు బయటికొచ్చాయి. వారిలో భాగంగా తన యూట్యూబ్ కంటెంట్తో నవ్వించే బమ్చిక్ బబ్లూ, యంగ్ హీరో రాజ్ తరుణ్, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబర్, ‘విరూపాక్ష’ ఫేమ్ సోనియా సింగ్, ప్రస్తుతం తన పర్సనల్ లైఫ్ చుట్టూ పలు కాంట్రవర్సీలు తిరుగుతున్న హేమ, విడాకులు అయిపోయిన మాజీ భార్య భర్తలు నేత్ర, వంశీకృష్ణ..

అలాగే నరేష్, రియాజ్, కిరాక్ ఆర్పీలలో ఎవరో ఒకరు.. బోల్డ్ కంటెస్టెంట్ రీతూ చౌదరీ, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సురేఖ వాణి కూతురు సుప్రీత, ఒక స్ట్రీట్ ఫుడ్ ఓనర్ దగ్గర నుండి సోషల్ మీడియా సెన్సేషన్ అయిపోయారు కుమారీ ఆంటీ. ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, పొలిటీషియన్ బర్రెలక్క... ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరికి చెందిన కుషిత కల్లపు.. బుల్లెట్ భాస్కర్, చమ్మక్ చంద్ర, అలాగే పరువు హత్యకు గురి అయిన ప్రణయ్ భార్య అయిన అమృత.. వీరు బిగ్ బాస్లో కంటెస్టెంట్స్‌గా వస్తే బాగుంటుందని మేకర్స్ అనుకుంటున్నారు.

Next Story

Most Viewed