'నాటు నాటు సాంగ్‌'కి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్.. చిరంజీవి రియాక్షన్ ఇదే!

by Rajesh |
నాటు నాటు సాంగ్‌కి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్.. చిరంజీవి రియాక్షన్ ఇదే!
X

దిశ, వెబ్ డెస్క్: ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి అరుదైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడం పట్ల మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇదొక అద్భుతమైన చారిత్రత్మక విజయం. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటుకి గానూ కీరవాణి గోల్డెన్ గ్లోబ్ అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు నా అభినందనలు. దేశం మిమ్మల్ని చూసి గర్విస్తోంది. సంగీతం, డ్యాన్స్ ఈ రెండింటి సెలబ్రేషనే 'నాటునాటు'. మన దేశమే కాదు ప్రపంచం మొత్తం ఈ రోజు మీతో కలిసి డ్యాన్స్ చేస్తోంది. చరణ్, తారక్‌తో పాటు అద్భుతమైన సాహిత్యం అందించిన చంద్రబోస్, ఉర్రూతలూగించేలా పాట పాడిన రాహుల్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్‌కు కంగ్రాట్స్' అని పేర్కొన్నారు. కాగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఒరిజినల్ సాంగ్ విభాగానికి గానూ ఈ అవార్డు దక్కింది. బుధవారం కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ వేదికగా జరిగిన ఈ అవార్డుల వేడుకలో రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్, కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొన్నారు. అవార్డు ప్రకటించిన సందర్భంగా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి చప్పట్లు కొడుతూ సందడి చేశారు. కాగా తెలుగు చిత్రానికి అరుదైన గౌరవం దక్కడం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more:

ఆస్కార్ రిమైండర్ లిస్ట్‌కు షార్ట్‌లిస్ట్‌కు మధ్య తేడా..?

Next Story

Most Viewed