హోటల్‌ రూంలో అడ్డంగా బుక్ అయిన గిల్.. సారా !

by Disha Web Desk 9 |
హోటల్‌ రూంలో అడ్డంగా బుక్ అయిన గిల్.. సారా !
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా.. యంగ్ క్రికెటర్ శుబ్ మన్ గిల్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. వీటికి మరింత బలాన్ని చేకూర్చేలా తాజాగా మరో వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. వీరిద్దరు కలిసి ఓ హోటల్‌ నుంచి బయటికి వస్తుండగా కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు. దీనికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో జనాలు వైరల్ చేస్తున్నారు.

ఇక గిల్ ఈ ఏడాది అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మతో పాటు గిల్ కూడా టీమిండియాకు ఎంతో కీలక ఆటగాడు. అయితే సారా పూణె వేదికన జరిగిన మ్యాచ్‌కు తన ఫ్రెండ్స్‌తో కలిసి వెళ్లింది. ఫీల్డింగ్ సమయంలో గిల్ క్యాచ్ పట్టగా సారా ఎగిరి గంతులేసింది. బ్యాటింగ్‌లో గిల్ రెండు సిక్సర్లు కొట్టగా.. రెండు సందర్భాల్లోనూ సారా చప్పట్లతో అతడిని ప్రోత్సహిస్తూ కేరింతలు కొట్టింది. కొన్ని రోజుల పాటు వీరిద్దరికి బ్రేకప్ అయ్యిందని వార్తలు వచ్చాయి. కానీ ఈ మ్యాచ్‌తో మళ్లీ వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని జనాలకు అర్థమయిపోయింది. ఇప్పుడు హోటల్ వద్ద మరోసారి బుక్ అయ్యారు.

Next Story